గట్ల కానిపర్తి లో ఏం జరుగుతుంది
గ్రామ సీమలు దేశానికి పట్టుగొమ్మలు,
గ్రామ స్థాయిలో పౌర భాగస్వామ్యం ద్వారా ఏ విధంగా సమాజంలో మార్పు తీసుకురావచ్చు అనే విషయంలో ఒక కేస్ స్టడీగా గట్ల కానపర్తి యువత దారి చూపుతున్నారు.
గ్రామంలోని యువత "గ్రామాభివృద్ధి కమిటీ - గట్ల కానిపర్తి" అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సంఘం ద్వారా గ్రామంలో మొదటగా విద్యాభివృద్ధికి దోహద పడాలని నిశ్చయించుకుని ఆ దిశగా పని చేయడం ప్రారంభించారు. గ్రామంలో పఠన మందిరాన్ని ఏర్పాటు చేసి, గ్రామస్తుల్లో, విద్యార్థుల్లో పఠన అభిలాషను పెంచుతున్నారు.
తద్వారా గ్రామం నుండి ప్రపంచ మేధావులను తయారు చేయాలని సత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు.
పఠన మందిరం ద్వారా ఈ టెక్నాలజీ యుగంలో సెల్ ఫోన్ కే పరిమతమవుతున్న విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన సాధ్యమయ్యేలా దోహద పడుతున్నారు.
స్వచ్ఛమైన పరిసరాలు ప్రగతికి బాటలు పరుస్తాయి. గ్రామస్తులను వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం స్వచ్ఛమైన పరిసరాలు శిశువు ఎదుగుదలకు ఎంత గానో దోహద పడతాయి
అలాగే పంకిలమైన పరిసరాలు దోమలు, ఈగలకు ఆలవాలంగా నిలుస్తాయి.
ఒక్క దోమ కాటుతో డెంగ్యూ , చికెన్ గున్యా , మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దాన్ని గుర్తెరిగి గ్రామంలో పారిశుధ్యం మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
వీళ్ళ పని విధానం చూస్తుంటే యువత’గురించి ఓ మహాకవి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి కదా
కొంతమంది యువకులు
రాబోవు యుగం దూతలు
పావన నవజీవన
బృందావన నిర్మాతలు
బానిస పంధాలను తల
వంచి అనుకరిoచరు
పోనీ అని అన్యాయపు
పోకడలు సహించరు
హాట్స్ ఆఫ్ టు యూత్ ఆఫ్ గట్ల కానిపర్తి
Comments
Post a Comment