ఎట్టకేలకు ప్రముఖ ద్విభాషా(తెలుగు,తమిళ్) చిత్రంలో తెలంగాణ కళాకారుడు వెంకట్ ఎమ్ కి అవకాశం
పూర్తి గ్రామీణ నేపధ్యం నుండి వచ్చిన వెంకట్ స్వస్థలం వరంగల్ జిల్లా పాఖాల కొత్తగూడ మండలం పొగుల్లపల్లి అనే ఒక చిన్న పల్లెటూరు, చిన్నతనం లొనే తండ్రి ని కోల్పోయిన ఆయన చిన్నప్పటి నుండి కష్టాల కడలి కి ఎదురీదాడు, మెట్రిక్యులేషన్ వరకు తన సొంత ఉరిలోనే విద్యాభ్యాసం కొనసాగించాడు.
ఆర్థిక, మానసిక మరియు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన కోడలి ని చిన్నతనంలొనే వివాహమాడాల్సి వచ్చింది.
చిన్నప్పటి నుంచే వెంకట్ కి సినిమాలన్నా నటన అన్నా మక్కువ ఎక్కువ,
ఆ ఇష్టం తోనే హైదరాబాదు కి మకాం మార్చాడు, అక్కడ ఒక చిన్న ప్రయివేటు సంస్థ లో ఉద్యోగం చేసుకుంటూనే నటన లో శిక్షణ తీసుకున్నాడు,
ఒకవైపు ఆర్థిక సమస్యలు మరోవైపు కుటుంబ భాద్యతలు ఇంకొక వైపు తను కలలు కన్న సినిమా రంగం , ఈ సందిగ్ధావస్థ పరిస్థితుల్లో ఒక్కోసారి తనకు తానే ఒంటరిగా కుమిలిపోయేవాడు, అయితే చిన్నప్పటి నుండే కష్టాలను ఎదుర్కున్న అనుభవం వలన తన ముఖం లో ఇవేమీ కనిపించకుండా తన గమ్యం వైపు పయనించడానికి ఎంతో కృషి చేయవలసి వచ్చింది.

సినిమా వేశాల అన్వేషణలో భాగంగా ప్రతి సినిమా కార్యాలయాలను సందర్శించడం తో పాటు తనకు తిండి పెడుతున్న వృత్తి కి న్యాయం చేసుకుంటూ ఉండేవాడు.తను ఎంచుకున్న ఏ రంగంలో అయినా దూసుకు పోయే తత్వం ఉన్న వెంకట్ తను పనిచేసే సంస్థ లో కూడా పలుమార్లు ఉత్తమ ఉద్యోగి గా ఎంపికై ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాడు..
ఒక దశలో చిన్న చిన్న అవకాశాలు పలకిరించిన అంత చెప్పుకోదగ్గ పేరు ని మాత్రం తెచ్చి పెట్టలేదు.(100% లవ్ " సినిమాలో హీరో మిత్ర బృందంలో ఒకరిగా, "వసూల్ రాజా" సినిమాలో గతం లో అవకాశం రావడం జరిగింది ).ఈ మధ్య కాలంలో తను నటించిన "అలనాటి రామ చంద్రుడు" అనే లఘు చిత్రం లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. "క్షేత్ర జీవ" చిత్రంలో కూడా నటించాడు.
తన నటన కౌశలాన్ని చూసి కీ. శే. శ్రీహరి గారు ఎంతో భవిష్యత్తు ఉందని , తాను చేసే ప్రతీ తన సినిమాలో వెంకట్ కి వేషం వచ్చేలా చూస్తానని హామీ కూడా ఇచ్చారు. కొద్ది కాలానికే ఆయన కానరాని లోకాలకు వెళ్లడంతో సినిమా అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి.
అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా తన
ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు.
"లోకంలో ఉన్న చీకటంతా ఏకమైనా అగ్గిపుల్ల వెలుగు ని దాచలేదు" అన్న చందంగా 19 సంవత్సరాల శ్రమ కి ప్రతిఫలం గా ఒక ప్రముఖ దర్శకుడి చిత్రంలో హీరో కి తమ్ముడు గా వెంకట్ ఎమ్ కి అవకాశం రావడం జరిగింది.
భూమి ని చీల్చుకు పుట్టిన పచ్చని పసరిక లా..
భగ భగ మండే నిప్పుల కొలిమిలో మలిచిన ఆయుధం లా తన ప్రతిభ ను నిరూపించుకోవడానికి సదా సిద్దం అంటున్నాడు వెంకట్ ఎమ్.
- సురేష్ అడుప
భగ భగ మండే నిప్పుల కొలిమిలో మలిచిన ఆయుధం లా తన ప్రతిభ ను నిరూపించుకోవడానికి సదా సిద్దం అంటున్నాడు వెంకట్ ఎమ్.
- సురేష్ అడుప
Congratulations.. Venkat
ReplyDelete