గట్ల కానిపర్తి లో ఏం జరుగుతుంది
గ్రామ సీమలు దేశానికి పట్టుగొమ్మలు, గ్రామ స్థాయిలో పౌర భాగస్వామ్యం ద్వారా ఏ విధంగా సమాజంలో మార్పు తీసుకురావచ్చు అనే విషయంలో ఒక కేస్ స్టడీగా గట్ల కానపర్తి యువత దారి చూపుతున్నారు. గ్రామంలోని యువత "గ్రామాభివృద్ధి కమిటీ - గట్ల కానిపర్తి" అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘం ద్వారా గ్రామంలో మొదటగా విద్యాభివృద్ధికి దోహద పడాలని నిశ్చయించుకుని ఆ దిశగా పని చేయడం ప్రారంభించారు. గ్రామంలో పఠన మందిరాన్ని ఏర్పాటు చేసి, గ్రామస్తుల్లో, విద్యార్థుల్లో పఠన అభిలాషను పెంచుతున్నారు. తద్వారా గ్రామం నుండి ప్రపంచ మేధావులను తయారు చేయాలని సత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. పఠన మందిరం ద్వారా ఈ టెక్నాలజీ యుగంలో సెల్ ఫోన్ కే పరిమతమవుతున్న విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన సాధ్యమయ్యేలా దోహద పడుతున్నారు. స్వచ్ఛమైన పరిసరాలు ప్రగతికి బాటలు పరుస్తాయి . గ్రామస్తులను వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం స్వచ్ఛమైన పరిసరాలు శిశువు ఎదుగుదలకు ఎంత గానో దోహద పడతాయి అలాగే పంకిలమైన పరిసరాలు దోమలు, ఈగలకు ఆలవాలంగా నిలుస్తా...