సికింద్రబాద్ ఎంపీ గా పోటీ లో ఉన్న సామాజిక కార్యకర్త రవి కుమార్ వోదెల సుదూర లక్ష్యం చేరేనా....తమకి తగిన నాయకుడు దొరికాడనే సంబరంలో ఓటర్లు........

ఢిల్లీలోని  ప్రతిష్టాత్మక సివిల్స్ కోచింగ్ సెంటర్ లో ఫ్యాకల్టీ , రోజంతా సివిల్స్ వాళ్ళకి పాఠాలు బోధించడం ,సాయంత్రం కాగానే బాల కార్మికులు ఉన్న ప్రదేశానికి చేరడం వారి బాగోగులు చూడడం వారిని పాఠశాలల్లో చేర్పించడం ఆయన రోజువారీ దిన చర్య..ఢిల్లీ లోని వీధి బాలలకు ఆ పేరు సుపరిచితం. వీధి బాలలంటే అతనికి వల్లమాలిన ప్రేమ , హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ లో సభ్యుడు, ఢిల్లీ యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో  పరిశోధక విద్యార్థి.వందల మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి జాతి సౌధానికి మేలిమి ఇటుకలను తయారు చేస్తున్నా అతనిలో ఏదో అసంతృప్తి .ప్రత్యక్ష సామాజిక  మార్పు కోసం విజ్ఞాన వంతులు, నిబద్దత కలిగిన యువత రాజకీయాల్లోకి వెళ్లి శాసన కర్తలుగా మారాలని ప్రతి రోజు తరగతి గదిలో బోధించే అతను ఒకరోజు హఠాత్తుగా ఢిల్లీ వదిలి హైదరాబాద్ చేరారు.తనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తన అంతిమ లక్ష్యమైన సామాజిక రుగ్మతల నివారణ కోసం తనే ఒక శాసన కర్త గా మారాలని తీర్మానించుకున్నాడు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నాడు.

అసలు ఇంతటి నిబద్దత కలిగిన అతని నేపథ్యం ఏంటని ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి

అతనిది మహబూబాబాద్ పట్టణం 10వ యేటనే కుటుంబ భారాన్ని తనపై వేసుకున్న బాల కార్మికుడు, రాత్రనక, పగలనక కష్టప డి కుటుంబాన్ని పోషించేవాడు,ఆ చిరు ప్రాయంలోనే విద్య విలువ తెలుసుకొని, తను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి చదువు ఒక్కటే మార్గమని నమ్మి ఒక పూట పాఠశాలకు , మరొక పూట పనికి వెళ్ళడం ప్రారంభించాడు.ఉదయం తన దిన చర్య ఇంటింటికీ న్యూస్ పేపర్ వేయడంతో ప్రారంభం అయ్యేది.ఒక రోజు న్యూస్ పేపర్ లో వారి జిల్లా కలెక్టర్ నీ  సన్మానించడం అనే వార్త  చూసాడు.ఆ వార్త చదువుతున్న  క్రమంలోనే కలెక్టర్ అనే ఉద్యోగం ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ ఉద్యోగం వస్తె తన లాంటి అనేక మందికి ఆసరాగా నిలబడవచ్చని ,ఆ లేత వయసులోనే కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు, ఒక రోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు పెద్దయ్యాక మిరేమవుతారు అనే ప్రశ్నకు కలెక్టర్ అవుతానని సమాధానమిచ్చాడు. ఒక్కసారి తరగతి గది అంతా నువ్వు పాఠశాలకు వచ్చేదే ఒక్క పూట అంటూ వెటకారపు నవ్వుతో దద్దరిల్లిపోయింది.  అప్పుడే తనలో ఉన్న కలెక్టర్ కావాలన్న కాంక్ష మరింత బలపడింది.
కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ చదవాలని ,అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అని మన లాంటి పేద వాళ్ళకి అది సాధ్యం కాదని చాలామంది చెప్పారు. నీ వల్ల కాదు అన్న ప్రతి సారి తనలోని కాంక్ష  మరింత బలపడింది. ఒక్కటే ధ్యాస కలెక్టరు కావడమే.పేపర్ బాయ్, రిక్షా పుల్లర్, టూషన్ మాస్టర్ గా వివిధ పనులు చేసుకుంటూ ఇంటర్ ,డిగ్రీ చదివేరోజుల్లోనే  "సేవా భారతి" అనే స్వచ్చంధ సంస్థ ద్వారా మారుమూల గిరిజన తండాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనీ గిరిజన కుసుమాలకి  ఐదు సంవత్సరాలపాటు విద్యాబుద్దులు నేర్పించారు, ఆ క్రమంలో గిరిజన తండాల్లోని  విద్యార్థుల దీన స్థితి తన చేరాల్సిన  గమ్యం ఏంటో స్పష్టంగా నిర్ధారించుకునేందుకు దోహద పడింది.అప్పటి నుండి తన ఐఏఎస్ ఆశయాన్నే శ్వాసగా మలుచుకున్నాడు.
మొత్తం మీద బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మి నిస్ట్రేషన్ (BBM) పూర్తి చేశాడు. ఐఏఎస్ పరీక్ష రాయడానికి కావల్సిన కనీస అర్హత  సాధించాడు. అప్పుడే ప్రభుత్వం "మెరుగు" అనే కార్యక్రమం ప్రారంభించింది.(డిగ్రీ  చదువుతున్న వారిని ఒక పరీక్ష ద్వారా ఎంపిక చేసి  పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమం ఇది) "మెరుగు" కార్యక్రమం వారు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి డిగ్రీ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా శిక్షణ పొందాడు.అప్పుడే  ఐఏఎస్ చదవాలంటే హైదరాబాద్ లో ఉండాలి,  మెరుగైన కోచింగ్ అవసరం అని తెలుసుకొని. హైదరాబాద్ లో ఉండడం ఎలా అని ఆలోచిస్తుంటే ఒక స్నేహితుడి సలహా మేరకు లాసెట్ రాసి రాష్ర్ట స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించాడు.
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో సీట్ సంపాదించాడు. సివిల్స్ కోసం సీరియస్ గా ప్రిపరేషన్ ప్రారంభించాడు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ నుండి అశోక్ నగర్ కి ప్రతి రోజూ నడుచుకుంటూ వచ్చేవాడు, మధ్యాహ్నం రెండు అరటిపళ్ళు రెండు గ్లాసుల నీళ్లతో కడుపు నింపుకొని చదివి తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. గ్రామీణ నేపథ్యం, మామూలు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి ఉండడం వల్ల సహజంగా ఉండే బెరుకు వల్ల ఇంటర్వ్యూ బోర్డ్ ను మెప్పించలేక స్వల్ప మార్కులతో సర్వీస్ కోల్పోయాడు.
అయినా స్థైర్యాన్ని కోల్పోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. అలా నాలుగు సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా యూపిఎస్సి ఇంటర్వ్యూ బోర్డ్ తన ప్రతిభను గుర్తించలేక పోయింది.

ప్రిపరేషన్ లో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ స్కూల్ లో పీజీటీ ఉద్యోగం వచ్చింది. కాని చిన్నప్పటి నుండి తన లాంటి వాళ్లను దారిద్ర్య శృంఖలాల నుండి బయట పడేయాలన్న సంకల్పం, ఐఏఎస్ సాధించాలన్న  తపన మస్తిష్కంలో నాటుకుపోవడంతో ఆ ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. అప్పటికి తను ఇంటి నుండి బయటికి వచ్చి సరిగ్గా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల కాలంలో తన గుండె చప్పుడు సివిల్స్ ..సివిల్స్.. ..ఈ 15 సంవత్స రాల కాలంలో తను అమ్మా నాన్నలతో గడిపిన రోజులు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. నాలుగవ సారి   ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవుతున్న సమయంలోనే వాళ్ళ అమ్మ ఆరోగ్యం క్షీణించడం.ఢిల్లీలో ఉన్న అతనికి ఈ విషయం కొంచెం లేట్ గా తెలియడం. హుటాహుటిన ప్రిపరేషన్ పక్కన పెట్టి హైదరాబాద్ కి రావడం, ట్రీట్మెంట్ ప్రారంభించే లోపు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళడం,తన కన్న తల్లిని కాపాడుకో లేని నిస్సహాయ స్థితి తన మీద తనకే ఏహ్యభావం కలిగేలా చేసింది. ఆ బాధ లో నుండి కోలుకునే లోపే తండ్రి  దూరమవడం తనని మరింత కృంగ దీసింది. కానీ విధి ముందు లొంగి పోకుండా తన అంతిమ లక్ష్యం చేరడానికి ఐఏఎస్ అనేది ఒక మార్గం మాత్రమే నని.వేరే అనేక మేలిమి మార్గాలు ఉన్నాయని గ్రహించి  ఢిల్లీలో సివిల్స్ ఫ్యాకల్టీ గా చేరి అనేక మంది ఐఏఎస్ లను తయారు చేస్తూ, వివిధ స్వచ్చంధ సంస్థల్లో పనిచేస్తూ సామాజిక కార్యకర్త గా , పరిశోధకుడిగా కొనసాగుతున్నాడు.
ఆయనే రవికుమార్ వోదెల. ప్రస్తుతం కార్మిక, కర్షక, నిరుద్యోగ ,తాడిత, పీడిత వర్గాలు బల పర్చిన స్వతంత్ర అభ్యర్థిగా సికింద్రాబాదు పార్లమెంటు స్థానానికి  టూత్ బ్రష్ గుర్తుతో పోటీ చేస్తున్నాడు. ఇలాంటి నాయకుడి కోసమే సికింద్రాబాదు ఓటర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండడం కొసమెరుపు..

Comments