నిజాయితీకి నిలువుటద్దం తహసీల్దార్ ఇక్బాల్: ఏకమైన రెవెన్యూ ఉద్యోగులు
నిజాయితీకి నిలువుటద్దం తహసీల్దార్ ఇక్బాల్: ఏకమైన రైతులు రెవెన్యూ ఉద్యోగులు
తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిక
నిప్పు లాంటి మనిషి, నిరంతర ప్రజా సేవకుడు అయిన తహసీల్దార్ ఇక్బాల్ గారిపై ఇటీవల కొందరు స్వార్థపరులు అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలు చేయడంపై రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్బాల్ గారికి మద్దతుగా రెవెన్యూ ఉద్యోగులందరూ ఒక్కటయ్యారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ నిబంధనలకు కట్టుబడి, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే ఒక అధికారిపై ఇలాంటి బురదజల్లే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని వారు మండిపడ్డారు.
నిజాయితీకి మారుపేరు
తహసీల్దార్ ఇక్బాల్ గారు ఎక్కడ బాధ్యలు చేపట్టినా కార్యాలయంలో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేశారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా సేవలు అందిస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన అవినీతి రహిత పాలనను జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు, ఉద్దేశపూర్వకంగానే ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని సహచర ఉద్యోగులు స్పష్టం చేశారు.
తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదు
ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ...
తహసీల్దార్ ఇక్బాల్ గారు ఒక నిప్పు లాంటి మనిషి. ఆయన నిబద్ధతను శంకించడం సూర్యుడిపై ఉమ్మివేయడమే. వ్యక్తిగత స్వార్థం కోసం, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాల కోసం కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఖబర్దార్! చూస్తూ ఊరుకునేది లేదు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడం."
రైతులు, ప్రజల మద్దతు కూడా ఆయనకే..
కేవలం ఉద్యోగులే కాకుండా, స్థానిక ప్రజలు కూడా తహసీల్దార్ ఇక్బాల్ గారికి మద్దతుగా నిలుస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రతి సామాన్యుడి సమస్యను ఓపికగా విని, పరిష్కరించే ఇలాంటి అధికారి దొరకడం తమ అదృష్టమని, ఆయనపై వచ్చే అక్రమ ఆరోపణలను తాము నమ్మబోమని స్పష్టం చేస్తున్నారు.
ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపకపోతే, రెవెన్యూ శాఖ పరంగానే కాకుండా, తీవ్ర స్థాయిలో నిరసనలు చేపడతామని
హెచ్చరించారు .

Comments
Post a Comment